Jul 19,2021 19:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సౌత్‌జోన్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి, ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ క్లెమెంట్‌ క్జేవియర్‌ దాస్‌ మృతికి సిఐటియు రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపం తెలిపింది. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌ నర్సింగరావు, ఎంఎ గఫూర్‌ సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల ఉద్యమంలో క్లెమెంట్‌ దాస్‌ ముఖ్యపాత్ర నిర్వహించారని తెలిపారు. ప్రజాతంత్ర ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉన్నారని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ రంగంతో సహా ప్రభుత్వరంగ సంస్థలను మూకుమ్మడిగా ప్రైవేటీకరణ చేస్తున్న దశలో క్లెమెంట్‌ దాస్‌ మృతి ఉద్యమానికి తీరనిలోటని తెలిపారు. క్లెమెంట్‌దాస్‌ లేని లోటు పూడ్చుకోలేనిదైనప్పటికీ ఇన్సూరెన్స్‌ ఉద్యోగులు ఆ లోటు నుంచి బయటపడగలరని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. సౌత్‌జోన్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌కు, క్లెమెంట్‌ దాస్‌ కుటుంబ సభ్యులకు సిఐటియు రాష్ట్ర కమిటీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు.