పుట్టపర్తి అర్బన్ : నూతన సంవత్సర వేడుకల్లో అధికారులు, ప్రజలు, రాజకీయ నాయకులు సందడి నెలకొంది. ఆదివారం నాడు శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కార్యాలయంలో నాయకులు, అధికారులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే అందరినీ పలకరించి శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పార్టీ నాయకులు, అభిమానులు పూలమాలతో ముంచెత్తి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అంతా ప్రజలకు మంచి జరగాలని పల్లె ఆకాంక్షించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌ను పలువురు నాయకులు, అధికారులు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్లో కలెక్టర్ బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ చేతన్‌ను జిల్లా ఆర్డీవోలు, తహశీల్దాల్దార్లు ఇతర అధికారులు కలిసి మొక్కలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ను పలువురు పోలీస్ అధికారులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జడ్జి రాకేష్‌ను న్యాయవాదులు కలసి ఆయన చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.










