May 27,2022 14:38

ప్రజాశక్తి - మైలవరం : శుక్రవారం వెళ్లడం గ్రామంలో జరిగిన స్వచ్ఛ సంకల్ప కార్యక్రమానికి విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ఆంజనేయులు, మండల నాయకులు ఆర్ రమేష్, సిహెచ్ సుధాకర్, వెల్వడం, చంద్రాల గ్రామాలకు చెందిన నిర్వాసితులతో కలిసి వినతి పత్రం అందజేశారు. 2017 సంవత్సరంలో మైలవరం టూ నూజివీడు రోడ్డు విస్తరణలో భాగంగా వెల్వడం, చంద్రాల గ్రామాలకు చెందినవారు 120 మంది తమ నివాసాలను స్థలాలను కోల్పోయారు, నిర్వాసితులకు అందజేయవలసి కాంపోజిషన్ ఐదు సంవత్సరాలు గడిచిన అందకపోవడంతో నేడు కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. ప్రయత్నం చేశారు కలెక్టర్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంతో సమస్యను ఆయన దృష్టికి  తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సభా వేదికపై నుంచి రెండు గ్రామాల ప్రజలకు 15 రోజుల్లోనే సమస్యను పరిష్కరించి వారికి అందవలసిన కాంపొజిషన్ అందేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో  ఇస్సాక్, నాగేశ్వరరావు, ప్రసాద్, సురేష్, రెండు గ్రామాల నిర్వాసితులు పాల్గొన్నారు.