విరాళం అందజేస్తున్న మల్లికార్జునరావు
ప్రజాశక్తి -కందుకూరు : టిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఐ. మల్లికార్జున రావు కళాశాల నాక్ అసెస్మెంట్‌కి వెళ్తున్న నేపథ్యంలో కళాశాల అభివద్ధి పనులకు తన వంతు సహాయంగా రూ.12,000లు ప్రిన్సిపాల్‌కి అందజేశారు. అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కళాశాల నాక్ అసెస్మెంట్‌కి మార్చి నెలలో వెళ్తున్న సందర్బంగా కళాశాల పూర్వ విద్యార్థులు కళాశాల అభివద్ధికి దోహద పడాలని ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు.










