Jul 12,2022 23:30

ప్రజాశక్తి - గన్నవరం : కేంద్రసాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్‌డిఎ పక్షాల అభ్యర్థి ద్రౌపది ముర్ములకు గన్నవరం విమానశ్రయంలో పలువురు ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో వారు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి ఎంపిలు వి.విజయసాయి రెడ్డి, సియం రమేష్‌, జివిఎల్‌ నరసింహారావు, మిథున్‌రెడ్డి, వల్లభనేని బాలశౌరి, గోరంట్ల మాధవ్‌, మార్గాని భరత్‌, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగిరమేష్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు, కృష్ణాజిల్లా ఎస్పీ పి జాషువా, ప్రోటోకల్‌ డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విఎంపి లాంజ్‌కు తోడ్కుని వచ్చారు. విమానాశ్రయ లాంజ్‌ వద్ద శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్‌, కష్ణాజిల్లా డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, గుడివాడ ఆర్‌డిఒ పద్మావతి స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల గిరిజన సంప్రదాయ నృత్యాలతో గిరిజన కళాశారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన విజయవాడకు బయలుదేరి వెళ్లారు.