Jul 13,2021 16:30

కరీంనగర్‌ : తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డిని నటి ముమైత్‌ ఖాన్‌తో పోలుస్తూ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ నేతలు కౌశిక్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మంగళవారం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి కౌశిక్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కౌశిక్‌ రెడ్డిని శ్రీరెడ్డితో పోల్చారు. సిగ్గు, శరం లేకుండా కౌశిక్‌ మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్‌ ఇచ్చే స్క్రిప్టు చదివే నీకు సిగ్గు ఉండాలని, ముమైత్‌ ఖాన్‌తో పోలుస్తావా బిడ్డా.. నువ్వు శ్రీరెడ్డిలా వ్యవహరిస్తున్నావని అన్నారు. నువ్వు, నీ అన్న కోట్లాది రూపాయాలు తీసుకొని జిహెచ్‌ఎంసి, జనరల్‌ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. వైఎస్‌ నీకు టికెట్‌ ఇస్తా అని చెప్పిండా.. అప్పుడు నీ వయస్సు ఎంత, చెడ్డిలు కూడా వేసుకోలేదు బిడ్డా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.