ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
కెకెఆర్ గౌతమ్‌లో ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్
నెల్లూరు:ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్దంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బుక్స్, యూనిఫామ్ ,పై అధిక ఫీజులు వసూలు చేస్తున్న కెకెఆర్ గౌతమ్ స్కూల్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, పేరుతో , అధికమొత్తం ఫీజులు వసూలు చేయడానికి వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటి ఆధ్వర్యంలో కెకెఆర్ గౌతమ్ స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలకు హుటాహుటిన చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ నాయకులనుద్దేశించి డిప్యూటీడీఓ, ఎంఈఓ మాట్లాడుతూ వారం రోజులలో అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై నిబంధన విరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ గతంలో కార్పోరేట్ స్కూల్స్ యాజమాన్యం ఎల్‌కెజీ. యుకేజీ పుస్తకాలు తమ వద్దనే కొనుగోలు చేయాలని, విద్యార్ధులకు యూనిఫాం సైతం తమ వద్దనే కొనుగోలు చేయాలని షరతులు విధించారన్నారు. పుస్తకాల ధరలు ఏకంగా రూ.3 వేల నుంచి రూ.9 వేల వరకు రూరల్ ప్రాంతంలోని కార్పోరేట్ విద్యాసంస్థలు విక్రయించారన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా ప్రయివేట్ పాఠశాలలను సీజ్ చేయాలని, రవాణా శాఖ పిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా నగరంలో కొన్ని పాఠశాలలకు చెందిన వాహనాలు తిరుగుతున్నాయని వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా కెకెఆర్ గౌతమ్ నందు బుక్స్ ఫీజు యూనిఫామ్ ఫీజు బస్సు ఫీజులు విపరీతంగా వసూలు చేస్తున్నారని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కిరణ్, సంతోష్ ,నరేంద్ర ,కమిటీ సభ్యులు ,సుకుమార్ హర్ష పవన్ సోను ఆరిఫ్ పేదలు పాల్గొన్నారు.










