Jan 28,2023 21:11

- మాట్లాడుతున్న ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు

రాయచోటి టౌన్‌ : జిల్లాలో నమోదవుతున్న కేసుల విచారణ త్వరగా పూర్తిచేయాలని అన్నమయ్య ఎస్పీ హర్ష వర్ధన్‌ రాజు అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, సబ్‌ డివిజన్‌ పరిధిలో ఒక ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న నాన్‌ బైలబుల్‌ వారెంట్స్‌ ను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. చీటింగ్‌ కేసులకు సంబంధించిన ప్రతి కేసునూ క్షుణ్ణంగా పరిశీలించి వేగవంతంగా దర్యాప్తు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. దర్యాప్తులో ఉన్న మర్డర్‌ కేసులు, రేప్‌ కేసులు, చీటింగ్‌ కేసులు, మిస్సింగ్‌ కేసులు, పెండింగ్‌ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌, రోడ్డు ప్రమాదాలు, ఈ చలానా, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, స్పందన పిటిషన్‌ లపై ఆయన సమీక్షించారు. కేసుల దర్యాప్తు సమయంలో సాధారణంగా జరిగే పొరపాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దష్టి సారించాలని అన్నారు. కేసులు దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత సమయంలో సంబంధిత కోర్టులో దాఖలు చేయాలన్నారు. ఆస్తుల కేసుల విషయంలో ప్రత్యేక బందాలుగా ఏర్పడి త్వరగా ఛేదించి బాధితులకు నష్టపోయిన సొమ్మును రికవరీ చేసి వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. విచారణ దశలో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్‌ రాజ్‌ కమల్‌, డిఎస్‌పి శ్రీధర్‌, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.