ఫొటో : మాట్లాడుతున్న ఉదయగిరి జూనియర్ సివిల్ జడ్జి జె.అంజయ్య
కేసుల పరిష్కారానికి రాజీయే మార్గం
ప్రజాశక్తి-ఉదయగిరి : కేసులు పరిష్కారానికి రాజీయే మార్గం అని ఉదయగిరి జూనియర్ సివిల్ జడ్జి జె.అంజయ్య తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మెగా లోక్‌అదాలత్‌లో భాగంగా కోర్టు పరిధిలోని ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు, మర్రిపాడు, వింజమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 69 కేసులు, 413 పిట్టి కేసులు పరిష్కారమైనట్లు జడ్జి తెలిపారు. క్షణికావేశం జరిగే తప్పిదాలు సరైన పద్ధతి కాదని ప్రతిఒక్కరూ శాంతి పూరితమైన వాతావరణంలో మెలగాలని ఆయన కక్షదారులకు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు రామారావు షరీఫ్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.










