Apr 04,2022 12:53

తిరువనంతపురం : సిపిఎం 23వ జాతీయ మహా సభల సందర్భంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇ.కె.నయనార్‌ మ్యూజియాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయన్‌ మాట్లాడుతూ.. నయనార్‌ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను, పోరాట గాధలను ఇక్కడ ఉంచినట్లు చెప్పారు. నయనార్‌ అకాడమీలో భాగంగా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో నయనార్‌ భార్య శారదా టీచర్‌, పిల్లలు సుధా ఉష కఅష్ణ కుమార్‌, వినోద్‌ కుమార్‌, అల్లుడు కెసి రవీంద్రన్‌ పాల్గొన్నారు. మ్యూజియంలో నయనార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

కేరళలో నయనార్‌ మ్యూజియాన్ని ప్రారంభించిన పినరయి విజయన్‌