Jun 06,2023 20:20

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా ఆటో కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు టివివి ప్రసాద్‌

కేరళ తరహా సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : ఆటో కార్మికులకు కేరళ, తమిళనాడు తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా సిఐటియు కార్యాలయంలో ఇందుకూరుపేట మండలం ఆటో యూనియన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్టాండ్‌ దయాసాగర్‌ ఎస్‌.కె.చాన్‌ భాషాల అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఆటో కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు టివివి ప్రసాద్‌ పాల్గొని మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని, ఈ చలానా పోలీస్‌ వేధింపులు అధికంగా ఉన్నాయని ఇలాంటి పరిస్థితులను ఆటో కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజా మాట్లాడుతూ ఆటో కార్మికులు యూనిఫారం ధరించి ఐడెంటిటీ కార్డుతో ఆటో పేపర్స్‌ ఫోర్సులో ఉంచుకోవాలని, మద్యం సేవించి ఆటో డ్రైవ్‌ చేయరాదని ఆటో డ్రైవర్లకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు టి.మురళి, ఆటో యూనియన్‌ కమిటీ సభ్యులు మనోహర్‌, నరసింహ, మల్లి తదితరులు పాల్గొన్నారు.