Jan 07,2023 20:54

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న డాక్టర్లు

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న డాక్టర్లు
కేన్సర్‌ నివారణపై అవగాహన
కొడవలూరు:మండలంలోని నార్త్‌ రాజుపాలెం శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో కేన్సర్‌ నివారణపై విద్యార్థులకు అవగాహన సదస్సు, ఉచిత వైద్య పరీక్షలు ఎన్‌ఎస్‌ఎస్‌ పర్యవేక్షణలో జరిగినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ పి కుమార్‌ బాబు తెలిపారు. దీనికి మెడికవర్‌ హాస్పిటల్‌ నుండి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్‌ పిజిఎస్‌ఆర్‌ ప్రియ విద్యార్థులకు కేన్సర్‌ కారక ఆహారాలు ఫలితంగా వచ్చే సమస్యలపై విపులంగా విశదీకరించారు. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, రంగులు కలిపిన ఆహార పదార్థాలను తీసుకొనరాదన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. ఇదే విధంగా డాక్టర్‌ చంద్రశేఖర్‌, వైద్య సిబ్బంది ఉచితంగా సుమారు 75 మంది కళాశాల సిబ్బందికి బీపీ, సుగర్‌ అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు చేయడంతో పాటు తగు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు
. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ పెనుబల్లి బాబు నాయుడు, డైరెక్టర్‌ పెనుబల్లి కష్ణ చైతన్య, ఇతర డైరెక్టర్లు సమస్త తరపున వైద్య బందానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ టి.సుబ్రహ్మణ్యం, ఆస్పత్రి సిబ్బంది ఎస్‌ సురేష్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.