కడప ప్రతినిధి : కేంద్ర బడ్జెట్ 2023- 24 సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గనుల కేటాయింపు, సుమారు రూ.1050 కోట్ల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల పెండింగ్, కడప నుంచి విజయవాడకు రైల్వేలైన్, కడప-బెంగళూరు రైల్వేలైన్లకు కేటాయిం పులపై ఆసక్తి నెలకొంది. వీటిపై ఎనిమిదేళ్లుగా వామపక్ష, ఉక్కు సాధన కమిటీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఎనిమిది బడ్జెట్ల ఆర్థిక సర్వే, ఎటిఆర్ నివేదికల్లో ఉక్కు పరిశ్రమ ప్రతిపాదన లేకపోవడంతో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఇది ఉద్యమాలకు కేంద్రబిందువుగా మారింది. 2023-24 బడ్జెట్‌లోనైనా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, మైన్స్ కేటాయింపు, విమానాశ్రయ రన్‌వే పొడిగింపు పూర్తి, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు, కడప రైల్వేస్టేషన్ ఆధునీకరణ కేటాయింపులు చేయాల్సి ఉంది. కొన్ని రైల్వేలైన్లకు బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర వాటా ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ ఎటువంటి కేటాయింపులు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కడప- బెంగళూరు రైల్వే ప్రాజెక్టు అలైన్‌మెంట్ మార్పను కోరుతూ లేఖ రాసిన నేపథ్యంలో కేటాయి ంపులపై ఉత్కంఠ నెలకొంది. రెండేళ్లుగా సాధారణ బడ్జెట్‌లో రైల్వేబడ్జెట్‌ను కలిపే యడంతో రైల్వే ప్రా జెక్టుల కేటాయింపుల్లో సమాన ప్రాధాన్యత దక్కు తుందనే ఆశించిన వారికి నిరాశే మిగిలింది. కడప-బెంగళూరు, ప్రొద్దుటూరు-కంభం, భాకరాపేట-గిద్దలూరు, ఓబులవారిపల్లి-వాల్మీకి పురం పెండింగ్ ప్రాజెక్టులుగానే ఉన్నా యి. కడప-బెంగళూరు ప్రాజెక్టు రెండవ దశలో భాగంగా పెండ్లి మర్రి నుంచి రాయచోటి మీదుగా చిత్తూరు జిల్లా వరకు చేపట్టాల్సిన పనులు నిలిచిపో వడం విస్మయాన్ని కలిగి స్తోంది. ఓబులవారిపల్లి- కృష్ణపట్నం రైల్వేలైన్ ప్రారం భించినప్పటికీ, సరుకు సరఫరాకు మాత్రమే పరిమి తం కావడం ఆందోళన కలిగి స్తోంది. ప్రొద్దుటూరు- కంభం, భాక రాపేట- గిద్దలూ రు, ఓబులవారిపల్లి- వాల్మీకి పురం రైల్వేలైన్ ప్రతిపాదనల దశ దాటక పోవడం నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. కడప-బెంగళూరు, కడప-విజయవాడ లైన్ కేటాయింపు ఆశలపైనే అందరి దృష్టీ నిలి చింది. నందలూరు రైల్వే లోకోషెడ్‌కు ప్రత్యామ్నాయం, షిర్డీకి రైలు, తిరుపతి-మచిలీపట్నం రైలు కడప మీదుగా వెళ్లే అవకాశం కల్పిం చాలనే డిమాండ్లకు మోక్షం లభించడంపై ఆసక్తి నెలకొంది. తిరుపతి, యర్రగుంట్ల ప్రాంతాల నుంచి రాజధానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్న నేపథ్యంలో కడప-విజయవాడ, కడప-బెంగళూరు రైలుమార్గాలకు నిధుల కేటా యింపులు చేయాలని ప్రజానీకం ఎదురు చూస్తోంది.










