Apr 11,2023 21:15

కడప- బెంగుళూరు రైల్వే లైను కు గ్రహణం

కడప ప్రతినిధి : కడప-బెంగళూరు రైల్వేలైన్‌ పనులకు గ్రహణం ప ట్టింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఫిఫ్టీ ఫిఫ్టీ మ్యాచింగ్‌ గ్రాంట్లతో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా 13 కి.మీ మేర పనులు పూర్తి చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ మరణానంతరం రైల్వేలైన్‌ పడకేసింది. 2022-23 కేంద్ర బడ్జెట్‌లో రూ.289 కోట్లు, 2023-24 బడ్జెట్‌లో రూ.10 లక్షల చొప్పున అత్తెసరు కేటాయింపులు చేసింది. రైల్వేలైన్‌ సూప రింటెండెంట్‌ ఇంజినీర్‌ కార్యా లయాన్ని తరలించడం, అతి స్వల్ప కేటాయింపులను బట్టి పరిశీ లిస్తే కడప-బెంగళూరు రైల్వేలైన్‌ పనులను కోల్డ్‌ స్టోరేజీలో పడేసి నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటు విడుదల చేయలేదనే పేరుతో కేంద్ర బిజెపి సర్కారు తొండాట ఆడుతోంది. ఇటు వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన మంత్రి మోదీని గద్దెదించండి...దేశాన్ని కాపాడండి అనే నినాదంతో వామ పక్షాలు ఈ నెల 14 నుంచి 30 వరకు చేపట్టిన ప్రచార భేరిని ఆదరించాల్సిన అవసరం ఏర్పడింది. కడప- బెంగళూరు రైల్వేలైన్‌ పనులకు బిజెపి బ్రేకులు వేస్తోంది. గతేడాది రాష్ట్ర ప్రభు త్వం ముద్దనూరు- ముదిగుబ్బ రైల్వేలైన్‌ లింకుతో ఖర్చు తగ్గు తుందనే పేరుతో రాసిన లేఖను వాడుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వేలైన్‌ పనులను గాడిలో పెట్టాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభు త్వం తీసుకోవాలి. 2017 నుంచి 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పట్టించుకున్న దాఖ లాల్లేవు. 2006లో కీ.శే మాజీ ముఖ్య మంత్రి వైఎస్‌ హయాంలో 50 శాతం రైల్వేలైన్‌ పనుల ఖర్చు భరిస్తామని ముందుకు రావడంతో రైల్వేలైన్‌ పట్టాలకు ఎక్కింది. వైఎస్‌ మరణానంతర ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గత నాలుగేళ్లుగా అత్తెసరు కేటాయింపులతో ముందుకు సాగని విషయం తెలిసిందే. 2022-23 బడ్జెట్‌లోనూ రూ.289 కోట్లు, 2023-24 బడ్జెట్‌లో రూ.10 లక్షలు మాత్రమే కేటాయించింది. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులను పరిశీలిస్తే రైల్వేలైన్‌ ఇప్పట్లో పూర్తి కావడం కష్టమేనని తెలుస్తోంది. ఇదిలాఉండగా కడప నుంచి పెండ్లిమర్రి, నందిమండలం మీదుగా అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, చిన్నమండెం, వాయ ల్పాడు, కర్నాటకలోని మాడగట్ట నుంచి కోలార్‌ వరకు రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌కు రూప కల్పన చేసిన సంగతి తెలిసిందే. రెండుజోన్ల పరిధిలో 257 కి.మీ మేర నాలుగు దశల రైల్వేలైన్‌ పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కిలోమీటర్ల మేర పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. నాలుగు దశల్లో భాగంగా మొదటి దశలో కడప నుంచి పెండ్లిమర్రి వరకు సుమారు 21 కి.మీ. వరకు 10 శాతం రైల్వేలైన్‌ పనులు పూర్తి చేసింది. డెమోట్రయల్‌రన్‌ నిర్వహించింది. 2013 భూసేకరణ చట్టం కింద సౌత్‌సెంట్రల్‌, సౌత్‌ వెస్ట్రరన్‌ జోన్లు మిగిలిన భూసేకరణ, సర్వే పనుల్ని పూర్తి చేయా ల్సి ఉంది. సౌత్‌ సెంట్రల్‌జోన్‌ కర్నాటక రాష్ట్ర పరిధిలో ఉండడంతో ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. 2017-18లో రూ.175 కోట్లు, 2018-19, 2019-20 బడ్జెట్‌లో అత్తెసరు నిధులు కేటాయింపుల నేపథ్యంలో ముందుకు సాగని సంగతి తెలిసిందే. 2022-23 బడ్జెట్‌లో రూ.289, 2023-24 బడ్జెట్‌లో సుమారు రూ.10 లక్షలు కేటాయింపులు చేసింది. కేంద్రం రూ.145 కోట్లు, రాష్ట్రం రూ.145 కోట్లను కేటాయించాల్సి ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిధుల లేమి కారణంతో కడప జిల్లాలోని ముద్దనూరు, అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ రైల్వేలైన్‌ కూడలి వరకు సుమారు 82 కిలోమీటర్ల మేర పనులు చేపడితే తక్కువ ఖర్చుతో బెంగళూరు లైన్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని లేఖ రాసింది. నిధుల లేమి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటును విడుదల చేయలేదనే పేరుతో కేంద్రంలోని బిజెపి సర్కారు కడప-బెంగళూరు రైల్వేలైన్‌ పనులను అటకెక్కించింది. కడప కేంద్రంగా రైల్వేలైన్‌ పనుల్ని పర్యవేక్షిస్తున్న ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయాల్ని తరలించింది. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సిబ్బందిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. కడప-బెంగళూరు రైలుమార్గం కలగా మిగిలిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మేధావులు, బుద్ధిజీవులు బిజెపి ప్రజావ్యతిరేక విధానాలను తిరస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే సత్యాన్ని గ్రహించాల్సి ఉంది.