కదిరి టౌన్ : కదిరి పట్టణం లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉత్తమ విత్తనోత్పత్తికి (2022 సంవత్సరానికి) గానూ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి జాతీయ అవార్డు అందజేసింది. గుజరాత్ రాష్ట్రంలోని జునాఘడ్ జాతీయ వేరుశనగ పరిశోధన కేంద్రంలో ఈ నెల 24 నుంచి 26 వరకు జాతీయ స్థాయిలో వేరుశనగ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారని, అందులో కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంపత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ 2022లో అధిక మొత్తంలో వేరుశనగ విత్తనోత్పత్తి చేసి దేశంలోని వివిధ రాష్ట్రాలకు వేరుశనగ కాయలు ఎగుమతి చేసినందుకు గానూ భారతీయ వ్యవసాయ పారిశోదన మండలి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టిఆర్ శ్యామ, డైరెక్టర్ డాక్టర్ బెవ అవార్డు అందజేశారన్నారు. ఈ అవార్డు దక్కడం పట్ల డాక్టర్ సంపత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కదిరి వ్యవసాయ పరిశోధన స్థానానికి అవార్డు వచ్చినందుకు ప్రధాన శాస్త్రవేత్త సంపత్, శాస్త్రవేత్తలు డాక్టర్ రాజేష్, వేమన, వెంకటరమణలకు జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయి.










