ప్రజాశక్తి-బత్తలపల్లి విశాఖపట్టణం జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఖ్యాతిని చాటాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శనివారం బత్తలపల్లిలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో సీనియర్స్ విభాగంలో మహిళలు, పురుషుల కబడ్డీ జట్లను ఎంపిక చేశారు. ఎంపిక ప్రక్రియకు జిల్లా నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. పురుషుల విభాగంలో 60 మంది మహిళల విభాగంలో 40 మంది పాల్గొన్నారు. క్రీడాకారులకు కబడ్డీ పోటీలను నిర్వహించారు. అందులో బాగా రాణించిన వారిని ఎంపిక చేశారు. ఎంపికైన వారు ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు విశాఖపట్టణం జిల్లా అంకుపాళ్యంలో 70వ రాష్ట్రస్థాయి మహిళం, పురుషులు కబడ్డీ పోటీలకు జిల్లాజట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమలంఓ ఆర్‌డి ప్రమీల, ఆర్డీటీ ఎటిఎల్ కుణ్యాంగం, అనంతపురం జిల్లా కబడ్డీ సంఘం ప్రసిడెంట్ హరినాథ్‌గౌడ్, వైస్ ప్రసిడెంట్ సంపత్‌కుమార్, మంజుల వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ కబడ్డీ పోటీల్లో క్రీడాకారులు రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు. అలాగే ఎంపిక కాని క్రీడాకారులు నిరాశ పడాల్సిన అవసరం లేదన్నారు. మరోసారి సత్తా చాటి తమ ప్రతిభను నిరూపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దాగిరి రామయ్య, సెక్షన్ కమిటీ నరసింహులు, అశ్విని పలువురు సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.
క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు










