పుట్టపర్తి రూరల్.ఈనెల 13 న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పుట్టపర్తి పట్టణ పరిధిలోని చెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగు రూం, కౌంటింగు హాలును ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ మంగళవారం పరిశీలించారు. అనంతరం పుట్టపర్తి , కొత్తచెరువులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కౌంటింగు రోజున స్ట్రాంగ్ రూం వద్ద చేపట్టాల్సిన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, తదితర చర్యలపై స్థానిక పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగంతో కలసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్ట్రాంగు రూంల వద్ద సాయుధ బలగాలచే గార్డు నిర్వహించాలని స్ట్రాంగు రూం, కౌంటింగు కేంద్రాల పరిసరాలు కవర్ అయ్యేలా సి.సి కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కెవి. రామకృష్ణ ప్రసాద్, డీఎస్పీ యశ్వంత్, పట్టణ సిఐ బాల సుబ్రమణ్యం రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తచెరువు : ఈనెల 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని రెవెన్యూ పోలీస్ అధికారులకు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ సూచించారు. కొత్తచెరువులోని బాలికలు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. మూడు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భారీ కేట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కెవి. రామకృష్ణప్రసాద్, డీఎస్పీ యశ్వంత్, సిఐ జయ నాయక్, తహశీల్దార్ రామాంజనేయ రెడ్డి, ఎస్‌ఐ లింగన్న తదితరులు పాల్గొన్నారు.










