Apr 14,2023 21:52

మృత దేహాలను పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు

 బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం (పిటిఎం)లో ఘోరం జరిగింది. విద్యుత్‌ తీగలు యమపాశాలై నలుగురిని బలితీసుకుంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. .పిటిఎం మండలంలోని కానుగమాకులపల్లెలో శుక్రవారం గృహప్రవేశం జరుగుతున్న ఇంటి ముందు వేసిన షామియానాకు ఒక్కసారిగా గాలి రావడంతో విద్యుత్‌ తీగలు తాకడంతో కరెంటు తీగలు తగలడంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని హుటాహుటిన బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారన్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరొకరు మృతి చెందారు. మరి కొంతమందికి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన బంధువులుగా గుర్తించారు. బి.కొత్తకోట మండలం కొత్తపల్లికు చెందిన లక్ష్మమ్మ(70), శాంతమ్మ(48), విజరు ప్రశాంత్‌(25), వడిగలవారిపల్లెకు చెందిన లక్ష్మణ్‌(53) మృతి చెందారు. విద్యుత్‌ షాక్‌కు గురైన సుబ్బమ్మ(75), సునీతా (40), సుధాకర్‌ (48) పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. గృహప్రవేశం వేళ కరెంటు తీగల రూపంలో మృతువు నలుగురిని కబలించడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. కాను గమాకులపల్లిలో రోదనలు మిన్నంటాయి. సంఘటనా స్థలాన్ని మదనపల్లి డిఎస్‌పి కె.కేశప్ప పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పిటిఎం పోలీసులు తెలిపారు. మృతులకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఎం
మదనపల్లె అర్బన్‌ : విద్యుత్‌ షాక్‌లో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు తెలిపారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రిలో పరామర్శించారు. హడావిడిగా పోస్ట్‌మార్టం నిర్వహించడం, అధికారులు చేసిన హడావిడి చూస్తే అనేక అనుమానాలు వ్యక్తమ వుతున్నాయని తెలిపారు. ఈ సంఘటనపై సమగ్రమైన విచా రణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమ వుతోందన్నారు. మృతులు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రే షియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారందరిఇ మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు టి.హరేంద్రనాథ్‌ శర్మ పాల్గొన్నారు.
అంత్యక్రియలకు నరహరి సాయం
పిటిఎం మండలంలోని కానుగమా కులపల్లిలో జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మమ్మ, విజరుప్రశాంత్‌ అంత్యక్రియలకు రాజంపేట పార్ల మెంట్‌ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి గంటా నరహరి రూ.25 వేలు సాయమందించారు. ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. వక్ష్మిఋతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.