కాసా టివిఎస్ ఆధ్వర్యంలో టివిఎస్ రోనిన్, ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: కాసా టివిఎస్ ఆధ్వర్యంలో ఆధునిక రెట్రో మోటార్ సైకిల్ ' టివిఎస్ రోనిన్, టివిఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆదివారం ఉదయం బెంజిసర్కిల్ వద్ద గల కాసా టివిఎస్ షోరూమ్ నందు ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.రంగరాజన్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతను ఆకట్టుకునే విధంగా ద్విచక్ర వాహనాలను అందించడంలో టివిఎస్ కంపెనీ ముందుంటుందని తెలిపారు. టివిఎస్ వాహనాల డీలర్‌గా కాసా టివిఎస్ నగర వాసులకు చక్కని సేవలను అందిస్తుందని తెలిపారు. కాసా టివిఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సుంకర భగత్‌సింగ్ మాట్లాడుతూ ప్రీమియం లైఫ్ స్టైల్ విభాగంలో తమ సంస్థ ప్రవేశించినట్లు తెలిపారు. ముందుగా బుక్ చేసుకున్న 100 టివిఎస్ ఐ క్యూబ్ వాహనాలను ఆదివారం ఒక్కరోజునే డెలివరీ అందచేసినట్లు తెలిపారు. టివిఎస్ రోనిన్ అనేది ఆధునిక, కొత్త యుగం వారికి అనువైన విధంగా ఉంటుందని తెలిపారు. టివిఎస్ రోనిన్ వాహనం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉందని తెలిపారు. టివిఎస్ రోనిన్ మునుపెన్నడూ లేనంతగా కనెక్ట్ చేయబడిన అనుభవంతో ప్రపంచస్థాయి ఇవి సాంకేతికత ఉంటుందన్నారు. ఈ వాహనాలు జులై 10వ తేదీ నుండి కాసా టివిఎస్ బెంజిసర్కిల్, కానూరు విజయవాడలో డెలివరీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే గుడివాడ, మచిలీపట్నం, గన్నవరం షోరూమ్‌నందు కూడా డెలివరీలను అందించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ మాజీ కార్యదర్శి జి.వి.రామారావు, మాజీ శాసన సభ్యులు యలమంచిలి రవి, నగర ప్రముఖులు ఆజాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి.నవీన్‌బాబు, టివిఎస్ కపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.










