నియామక ఉత్తర్వులు అందజేస్తున్న ఛైర్‌పర్సన్
ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పురపాలక సంఘంలో ప్రజారోగ్య విభాగంలో విధులు నిర్వహిస్తున్న దస్తగిరి సాబ్ విధి నిర్వహణలో మృతిచెందాడు. ఈనేపథ్యంలో కారుణ్య నియమకాల్లో భాగంగా ఆయన కుమార్తె ఇశ్రత్‌కు ప్రభుత్వం నాన్ పిహెరు వర్కర్‌గా నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఇశ్రత్‌కు మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ తన చాంబర్‌లో శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మద్దన జయరాములు, గిరీష్, మల్లికార్జునలు పాల్గొన్నారు.










