మదనపల్లె అర్బన్ : బెంగళూరు నుండి మదనపల్లెకు వస్తున్న ప్రయివేటు బస్సు బోల్తాపడి 63 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైన సంఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న కారును బస్సు ఢ కొట్టింది. బస్సు అదుపు తప్పి లోయలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 70 మంది ప్రయాణికుల్లో 63 మంది తీవ్రంగా గాయపడగా వారిలో ఏడుగురి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. వివరాలలోకి వెళితే...గురువారం ఉదయం బెంగళూరు నుంచి మదనపల్లి మీదుగా తిరుపతికి వెళుతున్న ప్రయివేట్ ప్రైవేట్ బస్సు ఉదయం సుమారు 10 గంటల సమయంలో మదనపల్లి సమీపంలోని, బెంగళూరు రోడ్డు వేంపల్లి పంచాయతీ కూకటిమాను గడ్డ వద్ద ముందు వెళుతున్న కారును వేగంగా వెళ్లి ఢకొీట్టింది. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి ఎడమవైపున రోడ్డు పక్కన వుండే 20 అడుగుల లోతున్న గుంతలోకి బోల్తా పడింది. ఈ హఠాత్ పరిణామంలో బస్సులో ప్రయాణిస్తున్న 70 మందిలో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చుట్టుపక్కల ఉన్న ప్రజలు, రైతులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ సుధాకర్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారందరిని స్థానికుల సాయంతో సురక్షితంగా బయటికి తీశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న 108 వాహన సిబ్బంది గోపి, మను, మస్తాన్, చలపతి తదితరులు క్షతగాత్రులను అంబులెన్స్లలో హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు.బాదితుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి కి రెఫర్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ కేశప్ప, ఆర్డీవో మురళిలు జిల్లా ఆస్పత్రికి చేరుకుని గాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బస్సు ప్రమాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
క్షతగాత్రులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు
మదనపల్లి-బెంగళూరు రోడ్డులో బస్సు బోల్తాపడ్డ ఘటనలో గాయపడి మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్, షాజహాన్‌బాషా, మున్సిపల్ చైర్‌పర్సన్ మనూజరెడ్డి, వైస్ చైర్మన్ జింకా చలపతి, జనసేన నాయకులు రామ్ దాస్ చౌదరి, వైసిపి నాయకులు నరేష్ కుమార్‌రెడ్డి బాధితులను పరామర్శించారు. గాయపడ్డ వారికి వైద్యం అందించిన వైద్య సిబ్బందిని, 108 సిబ్బందిని అభినందించారు.కారును ఢకొీట్టి గుంతలోపడ్డ బస్సు,










