Jul 07,2021 09:47

ప్రజాశక్తి-పెనుకొండ (అనంతపురం) : కారు డివైడర్‌ను ఎక్కి అవతలి రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన బుధవారం సోమందేపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక వివరాల మేరకు... సోమందేపల్లి మండలం 44 వ జాతీయరహదారిపై పాపిరెడ్డిపల్లి చెరువు వద్ద ఓ కారు డివైడర్‌ను ఎక్కి రోడ్డుకు అవతలివైపు వెళుతున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అయిదుగురికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.