Oct 24,2023 22:32

కారు అదుపు తప్పి నలుగురికి గాయాలు


కారు అదుపు తప్పి నలుగురికి గాయాలు
ప్రజాశక్తి-బుచ్చినాయుడుకండ్రిగ: మండల కేంద్రంలోని తానిగల్లు మలుపు వద్ద సోమవారం కేరళ కు చెందిన కారు అదుపుతప్పి ప్రమా దానికి గురి అయింది. ఈ ప్రమా దంలో తమిళ నాడుకు చెందిన కుటుంబీకులు తిరుమలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యా యని తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీస్‌ సిబ్బంది స్పందించి క్షత గాత్రులను శ్రీకాళహ స్తి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఎస్‌ఐ వెెంకట నరసింహం కేసు దర్యాప్తు చేస్తున్నారు.