Aug 25,2023 22:58

కార్పొరేటర్‌ చర్యల పట్ల నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - భవానీపురం : మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలని జనసేన పశ్చిమ ఇన్‌ఛార్జి, నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 40వ డివిజన్‌ కార్పొరేటర్‌ అయిన యరడ్ల ఆంజనేయ రెడ్డి వద్దకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ ఇప్పించాలని వచ్చిన అదే సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ పట్ల వ్యవహరించిన తీరు సభ్య సమజం తలదించుకునేలా ఉందని విమర్శించారు. ఈ ఘటనపై శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. వైసిపి ప్రభుత్వపాలనలో మహిళలకు రక్షణ లేదా అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ సేవల కోసం వచ్చే మహిళల పట్ల ఇలా ప్రవర్తించేవారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. మహిళపై లైంగికదాడికి పాల్పడ్డ వైసిపి 40వ డివిజన్‌ కార్పొరేటర్‌ యరడ్ల ఆంజనేయరెడ్డిపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పశ్చిమ మైనార్టీ నాయకులు ఎంఎస్‌.బేగ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం భవానీపురంలో ఈ సంఘటనపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎస్‌. బేగ్‌ మాట్లాడారు.