కరపత్రాలను పంపిణీ చేస్తున్న సిఐటియు నాయకులు
హిందూపురం : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని సిఐటియు పట్టణ నాయకులు రాము విమర్శించారు. ఏప్రిల్ 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తేవాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, కనీస పింఛను రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అత్తార్ బాబా, అంజి, గంగప్ప, రమేష్, జబీవుల్లా, బాలు, తిమమయ్య తదితరులు పాల్గొన్నారు.










