Mar 28,2023 22:34

బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని సిపిఎం నాయకులు విమర్శించారు. పట్టణంలో సిఐటియు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఎం ముద్రించిన దేశానికి మోదానీ ముప్పు అనే బుక్‌ లెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్‌ నాయకులు హరి మాట్లాడుతూ ఈ దేశాన్ని 2014 నుంచి పరిపాలిస్తున్న కార్పొరేట్‌ హిందుత్వ కూటమి ఎన్నో దారుణాలకు ఒడిగట్టిందన్నారు. జగన్‌ దన్నుతో రాష్ట్రాన్ని నిలువునా దోచుకోవడానికి ఉరుకులు పరుగులు పెడుతోందన్నారు. పెద్ద ఎత్తున దేశ సంపద లూటి చేసిన ఆదానికి కొమ్ముకాస్తున్న మోడీ ప్రభుత్వం పై పోరాటలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రమేష్‌, బాబావలి, మహబూబ్‌ బాషా, మూర్తి, మండల సిఐటియు నాయకులు వజ్రం నాగప్ప, చిన్న వెంకటేష్‌, తిప్పన్న, నరసింహులు, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.