కార్మికులకు వేతనాలిచ్చి ఆదుకోవాలిధర్నాలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం నాయకులు
రాయచోటి టౌన్ : గ్రామ పంచాయతీ కార్మికులకు 3-5 నెలలు, స్వచ్ఛ భారత కార్మికులకు 8-14 నెలల జీతం రాక పోవడంతో గడ్డి తిని బతికే పరిస్థితి ఉందని ఎపి గ్రామ పంచాయతీ కార్మికుల, స్వచ్ఛభారత కార్మికుల సంఘం (సిఐటియు అనుబంధం) జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎ.రామాంజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.సురేంద్ర బాబు పేర్కొన్నారు. కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు, స్వచ్ఛ భారత్ కార్మికులకు ఇచ్చే రూ. 10 వేల జీతం కూడా నెలల తరబడి ఇవ్వకుండా అధికారులు, పాలకులు వేధిం చడం సరైంది కాదని వాపోయారు. కరోనా కష్టకాలంలో పారిశుధ్య కార్మికులను యోధులు అని, నేడు వారి చేసిన పనికి జీతాలివ్వకుండా పస్తులు పెడు తున్నారని వాపోయారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా లేక జనరల్ పండ్ ద్వారా జీతాలివ్వాలన్న ఆదేశాలను తుంగలో తొక్కడం ఆనవాయితీగా మారందని వాపోయారు. చాలా మంది పంచాయతీ కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్ వర్తింపజే యాలన్నారు. వేతనాలు బ్యాంకుల ద్వారా కాకుండా చేతిక ిజీతం ఇస్తున్నారని, ఇదేమని అడిగితే పనికి రావొద్దని పాలకులు బెదిరిస్తన్నారని వాపోయారు. జీతాలు రాకపోతవడంతో అప్పులు తీవ్రం అయ్యాయని తెలిపారు. రాజకీయ వేధింపులు నివారించాలని, 15వ ఆర్థిక సంఘ నిధుల్లో పెండింగ్ జీతాలివ్వాలని నిబంధనలు చెబుతున్నా పాలకుల వివక్ష, అధికారుల నిర్లక్ష్యంతో కార్మిక కుటుంబాలు పస్తులుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంత వేలం పాట, చెత్త ఇంటి పన్ను నీటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం లో 50శాతం కార్మికులకు జీతాలివ్వాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.నాగబసిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ, స్వచ్ఛ భారత్ కార్మికుల సంఘం జిల్లా నాయకులు వెంకటరమణ, రెడ్డెయ్య, రామాంజులు, నారాయణమ్మ , శీను, నటరాజ్ కార్మికులు పాల్గొన్నారు.










