Dec 21,2022 22:37

హెల్త్‌ కార్డులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ

ప్రజాశక్తి-హిందూపురం : కార్మికుల సంక్షేమమే జగనన్న ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్మికులకు హెల్త్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘని, మాజీ నియోజకవర్గ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు జబివుల్లా, బలరామిరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.