Feb 03,2023 22:28

ఫొటో : మాట్లాడుతున్న డిపో కార్యదర్శి పి.ప్రసాద్‌

కార్మికుల సమస్యలపై ఎస్‌.డబ్ల్యుఎఫ్‌ ధర్నా
ప్రజాశక్తి -కావలి : స్థానిక ఎపిఎస్‌ ఆర్‌టిసి డిపో ఎదుట ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్యదర్శి పి.వి.ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ఒ.టి. డ్యూటీలకు అదనపు సొమ్మును తక్షణమే చెల్లించాలన్నారు. లేనిపక్షంలో ఒ.టి.డ్యూటీలను స్టాఫ్‌ డ్యూటీలుగా మార్చాలన్నారు. పి.డి.-01-2019 సర్క్యులర్‌ను విధిగా అమలు జరపాలన్నారు.
నైట్‌అవుట్‌ అలవెన్స్‌లను ఏ నెలకానెల జీతంతో చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యుఎఫ్‌ అధ్యక్షులు డి.ఆర్‌.రెడ్డి, కోశాధికారి సిహెచ్‌.వెంకటేశ్వర్లు, యు.మధు, వి.వి.రెడ్డి, ఎం.ఎ.బేగ్‌, గ్యారేజీ సెక్రటరీ వై.శీతారామయ్య, గౌరవాధ్యక్షులు ఎం.వెంకయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.