కార్మికుల సమస్యల పరిష్కరించాలి
ప్రజాశక్తి-కావలి రూరల్ : కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి మల్లి అంకయ్య, సిపిఐ కావలి నియోజకవర్గ కార్యదర్శి కొప్పోర్తి నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సమితి పిలుపు మేరకు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. 25న జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రాలు అందజేస్తామని, 26న రీజనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతామని తెలిపారు. పర్మినెంట్ వర్కర్ల చిన్నచిన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుంజి కిషోర్, పట్టణ అధ్యక్షుడు, యెండ్లూరి ఆదినారాయణ, కార్యదర్శి తన్నీరు వెంకటేష్, ప్రభావతి, రాజేష్, గుంజి అంకయ్య, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.










