Dec 23,2022 20:04

సమావేశంలో మాట్లాడుతున్న కె.సుబ్బరావమ్మ

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌హొ: కార్మిక ఉద్యమ బలోపేతం కోసం హొరాజీలేని పోరాటాలు చేపట్టాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి ఆర్‌టిసి డిపో వద్ద ఉన్నహొఆర్‌ఆర్‌ కల్యాణ మండపంలో శుక్రవారం రెండో రోజు సిఐటియు జిల్లా ప్రతినిధుల సభలో ఆమె ప్రసంగించారు. తిరుపతి జిల్లాలో కార్మిక సమస్యలు తీవ్రతరం అవుతున్నాయని, ప్రశ్నిస్తున్న వారిని వేధింపులకు గురి చేస్తున్నారని, నిర్బంధం తీవ్రత పెరిగిందని ఆమె ఆరోపించారు. టిటిడి, రైల్వే, విద్యుత్తు, పరిశ్రమలలో కార్మిక హక్కులు హరిస్తాయని ప్రశ్నించడానికి వీలు లేకుండా అణిచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరింత అధికమైందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి యజమానుల పక్షం వహిస్తూ, కార్మికుల హక్కులను కాల రాస్తున్నారని ఆరోపించారు. 15 సంవత్సరాల ముందే కనీస వేతనాల నిర్ణయం జరిగిందని, నేటికీ 70 షెడ్యూల్డ్‌ పరిశ్రమల్లో కనీస వేతనాల పెంపుదల జరగలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థల్లో సైతం కార్మికులకు న్యాయం జరగలేదని, వేతనాలు పెరగలేదని తీవ్రంగా విమర్శించారు. రెండు లక్షల 40వేల మంది కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల్ని తొలగించాలన్న ప్రయత్నం అందులో భాగమేనని విమర్శించారు. జిల్లాలో లక్షలాదిమంది వలస కూలీలు పనిచేస్తున్నారని, వీరికి చట్టాలు వర్తించడం లేదని, శ్రమ దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. రానున్న రోజుల్లో పారిశ్రామికరంగంలోనూ, ఆటో, బిల్డింగ్‌, వంటి అసంఘటితరంగాల్లో సైతం సిఐటియు బలపడాలన్నారు. అంగన్వాడీ, ఆశా లాంటి స్కీం వర్కర్లపై వేధింపులు తీవ్రం అవుతున్న నేపథ్యంలో కార్మిక ఉద్యమాలు పెరగడంతో పాటు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కన్వీనర్‌ ఎ.రామాంజులు అన్నమయ్య జిల్లాలో సిఐటియు నిర్వహించిన కార్యక్రమాల సమీక్షను, నిర్మాణ నివేదికను ప్రవేశపెట్టారు. జిల్లాలోని 28 ప్రాంతాలు పలు రంగాల నుంచి ప్రతినిధులు నివేదికపై చర్చలో పాల్గొని నివేదికను బలపరిచారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.బాలకాశి ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.