Mar 28,2022 15:11

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్ర కార్మిక చేపట్టిన రెండు రోజులు సమ్మె సోమవారం మొదటి రోజు ప్రారంభమైంది. సిఐటియు , ఐ ఎన్ టి యు సి అధ్వర్యంలో స్థానిక కోట జంక్షన్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన మూడులంతర్లు, ఎంజి రోడ్డు,గంటస్తంబం, మీదుగా కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు నిర్వహించారు. అనంతరం మానవహారం చేపట్టారు. మొదటి రోజు సమ్మెలో అంగన్వాడీలు, ఆశాలు, ఏ ఎన్ ఎం లు, ఎల్ ఐ సి,తపాలా శాఖ, బ్యాంక్ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, వివిధ పరిశ్రమలలో పని చేస్తున్న వారు, మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె కారణంగా నిర్వహించిన ప్రదర్శనను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కే.సుబ్బ రావమ్మా, ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం దేశాన్ని తాకట్టు పెట్టే పాలన సాగిస్తూ దేశ ప్రజలను బానిసలుగా మారుస్తున్నారని అన్నారు. దేశానికి ఆయువు పట్టుఅయిన ప్రభుత్వ రంగ సంస్థలను దోపిడీ దార్లుకు అప్పగించేందుకు ప్రైవేటీకరణ చేయడంతో పాటు వాటిని అమ్మకానికి పెడుతున్నారన్నారు.  ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ నీ, రైల్వే, పోస్టల్, ఎల్ ఐ సి, బ్యాంక్ లు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం ద్వారా పెట్టుబడిదారులు సేవలో మునిగి పోయిందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను,హక్కులను కాలరాసే విధంగా లేబర్ కోడ్ లను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. ప్రభుత్వ రంగ లను కాపాడుకోవడం కోసం ప్రజలు, కార్మికులు పోరాడకుండా మతం పేరుతో, కులం పేరుతో ముక్కలు చేసే విధంగా చిచ్చు పెట్టి పాలన సాగిస్తూ ఉన్నారన్నారు. అసంఘటిత తరంగ కార్మికులకు సమగ్ర చట్టం చేసి ఆదుకోవాలన్నారు. ఐసిడిఎస్, మధ్యాహ్న భోజన పథకంను ప్రైవేటీకణ చేసి చేతులు దులుుకునేందుకు మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని అన్నారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, వారిని రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు ఇచ్చి, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రెండురోజులు పాటు జరిగే సమ్మెలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుునిచ్చారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎపి మెడికల్ రీప్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యుఎస్ రవికుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి వి రమణ, సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు, సి ఐ టి యు నగర,అధ్యక్ష కార్యదర్శులు బి.రమణ, ఏ.జగన్మోహన్, ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.రమణమ్మ, ఎస్.ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి పీ.రామ్మోహన, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పెర్స్ యూనియన్ అధ్యక్షులు బి.పైడిరాజు కార్మికులు, ఉద్యోగులు, స్కీమ్ వర్కర్ల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.