Jun 10,2023 21:43

ఇరుకు గది కావడంతో ఆరుబయట పడేసిన డెలవరీ వస్తువులు

 రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌టిసి బస్సుల ద్వారా కార్గో సేవలు పేరుతో ఒక చోట నుంచి మరొక చోటకు లెటర్లను, పలు రకాల వస్తువులను చేరవేస్తున్నారు. జిల్లా కేంద్రంంలోని రాయచోటి ఆర్‌టిసి బస్టాండ్‌లో కార్గో సేవను ఇరుకైన గదిలో నిర్వహిస్తున్నారు. గది చాలక పోవడంతోఒ వస్తు వులన్నింటినీ ఆరు బయట ఎక్కడపడితే పడే స్తున్నారు. ప్రజల విలువైన వస్తువులకు భద్రత కూడా లేకుండా పోతోంది. ముఖ్యంగా మామి డిపండ్ల సీజన్‌ కాలంలో రైతులు కార్గో ద్వారా ఇతర ప్రాంతాలకు పంపించేందుకు ఆర్‌టిసి సేవలను పొందుతున్నారు. .ఆర్టిసి కార్గో సేవలో 25 కేజీల వరకు రూ. 80 చొప్పున డబ్బులు వసూ లు చేస్తున్నారు. బయట నుంచి వచ్చిన వస్తువులు, పార్శిళ్లకు భద్రత లేకుండా ఎక్కడబడితే అక్కడ పడేయడం ఉండడం గమనార్హం. విలువైన కవర్‌ సకాలంలో తమకు అవసమైనవారికి అందించాలనే ఉద్దేశంతోనే కార్గో ద్వారా డబ్బులు కట్టి పంపు తుంటారు. అలాంటి కవర్లు కూడా రాయచోటి బస్టాండ్‌లో విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ ఉండడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఆర్‌టిసి వారు కార్గో సేవ పేరుతో వినియో గదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ భద్రత అనేది లేదని పలువురు ఆరోపిస్తున్నారు. విలువైన వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేయంతో వాటిని తీసుకోవాలని వచ్చే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు .ఒకవేళ అకాల వర్షం కురిసినప్పుడు ఈ వస్తువుల పరిస్థితి ఏమిటి అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఆకతాయిలో అక్కడ ఉన్నటువంటి కవర్లను, విలువైన వస్తువులను తీసుకెళ్లినా పట్టిం చుకునే నాధుడు కరువయ్యారంటూ ఆరోప ిస్తున్నారు. ఏదైనా పార్సెల్‌ కోసం వెళ్లి అక్కడున్న సిబ్బందిని కార్గోలో వచ్చినాయని సిబ్బందిని అడిగితే సరైన సమాధానం కూడా సిబ్బంది చెప్పడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్‌టిసి ఉన్నతాధికారులు రాయచోటి కార్గో సేవలలో కొంత నేలపాటు, ప్రజల విలువైన వస్తువులకు భద్రత కల్పించాల్సిన అవసరమెంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.
షెల్టర్‌ను ఏర్పాటు చేయాలి
కార్గోలో పంపే వస్తువులకు ఆర్‌టిసి అధికారులు షెల్టర్‌ ఏర్పాటు చేయాలి. కార్గోదార పంపే వస్తువులు ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. కార్గో వస్తువులకు షెల్టర్‌ను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేయాలి. కార్గోలు పెట్టి వస్తువులను ప్రతి 30 నిమిషాలకు ఒకసారి పంపేందుకు చర్యలు తీసుకోవాలి.
- నరసింహులు, కొత్తపేట, రాయచోటి.
త్వరలో సెంటర్‌ ఏర్పాటు చేస్తాం
ఆర్‌టిసి బస్టాండ్‌ నిర్మాణం పనులను చేపడుతున్నాం. నెల తర్వాత కొత్త బస్టాండ్‌ ఆవరణంలో కార్గో కోసం రెండు గదులు నిర్మించాం. అందులో కార్గో వస్తువులు సరిపోయే విధంగా గదులను ఏర్పాటు చేస్తున్నాం. సిబ్బందికి పని ఒత్తిడి వల్ల డెలవరీ కొంచెం ఆలస్యం ఉంటుంది. ప్రయాణికులు పంపించే వస్తువులను ప్రతి 30 నిమిషాలకు ఒకసారి పంపించేందుకు చర్య తీసుకుంటాం.
-ధనంజనేయలు, ఆర్‌టిసి డిపో మేనేజర్‌, రాయచోటి.