Jan 18,2023 20:44

కళాశాల ప్రిన్సిపల్‌తో మాట్లాడుతున్న ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు

కురబలకోట : ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు అన్నారు. బుధవారం మండలంలోని కానిస్టేబుల్‌ రాత పరీక్షా పత్రాలు భద్రపరిచే మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను ఆయన పరిశీలించారు. కెమెరాల ఏర్పాటు, పనితీరును పరిశీలించారు. కళాశాలల చుట్టుపక్కల ఏర్పాటు చేసిన భద్రతను స్వయంగా పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూములను పరిశీలించి, కో-ఆర్డినేటర్స్‌, పోలీస్‌ అధికారులకు, రక్షణకు సంబంధించి పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ఆర్ముడ్‌ గార్డ్‌ను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించేలా తగిన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో మదనపల్లె డిఎస్‌పి కేశప్ప, ముదివేడు ఎస్‌ఐ సుకుమార్‌, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ యువరాజ్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ కమల్‌ బాషా పాల్గొన్నారు. మిట్స్‌