ప్రజాశక్తి -కందుకూరు : కందుకూరు పురపాలక సంఘ పరిధిలో పాత కూరగాయల మార్కెట్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శనివారం భూమి పూజ జరిగింది. ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి విలేకర్లతో మాట్లాడుతూ పురపాలక సంఘం ఆదాయ వనరులు సమకూర్చుటకుకొత్తగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌కు ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు 16 రూములు నిర్మిస్తున్నాము. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి పురపాలక సంఘానికి ఆదాయాన్ని చేకూర్చాలని దీన్ని నిర్మిస్తున్నారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లు పూర్తయిన తర్వాత మరో రెండు చోట్ల మున్సిపాలిటీ స్థలాలలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కందుకూరు పురపాలక సంఘ అభివద్ధి కోసం రూ. 26.85 కోట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ మన కందుకూరు విస్తరణ 60.2 స్క్వేర్ కిలోమీటర్ల విస్తరణలో ఉందన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్‌తోపాటు, కోటారెడ్డి నగర్‌లో ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మించామన్నారు.










