Feb 08,2023 22:24

విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి ముదిగుబ్బ : రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావటానికి కలసికట్టుగా కృషి చేద్దామని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్‌ తులసి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తులసీరెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోందని విమర్శించారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని 500 రూపాయలకే వంటగ్యాస్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈసమావేశంలో కాంగ్రెస్‌ మండల కన్వీనర్‌ బాసినేని ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నాయకులు నిషార్‌ అహ్మద్‌, హరి ప్రసాద్‌, రామకృష్ణ, అమర్నాథ్‌ రెడ్డి, ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు.