Jul 12,2021 15:25

మెదక్‌ : దేశంలో చమురు ధరలు పెంచడంపై నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మెదక్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ధర్నాచౌక్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పిసిసి మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ నేత గీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే, ఈ నిరసన కార్యక్రమాల్లో ఎడ్లబండ్లను కూడా ప్రదర్శనకు తీసుకువచ్చారు. ఓ ఎడ్లబండి పైనుంచి రాజనర్సింహ ప్రసంగిస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. ఎడ్లు ఒక్కసారిగా బెదరడంతో బండి కుదుపులకు గురై, బండిపై ఉన్న రాజనర్సింహ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మోకాలికి దెబ్బతగలడంతో వైద్యులు చికిత్స అందించారు.