కాంగ్రెస్ గెలుపుపై హర్షం
ప్రజాశక్తి-ఉదయగిరి : మోడీ ప్రభుత్వానికి కర్ణాటక ఎన్నికలతో నూకలుచెల్లాయని నియోజకవర్గం ఇన్‌ఛార్జి పిసిసి సభ్యులు దుద్దుకూరు రమేష్ నాయుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక బస్టాండ్ సెంటర్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనవిజయం సాధించడంపై బాణసంచాలు పేర్చి కేకులు కట్ చేసి ఘనంగా పండుగ వాతావరణం వేడుకలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో 140 స్థానాలు పైగా కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించడం సంతోషదాయకమన్నారు. జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయమని ఈ ఎన్నికలతో మోడీకి కర్ణాటక ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధిక మెజార్టీ సాధిస్తుందని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేసి మోడీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ జోడోయాత్ర, జైత్రయాత్ర ఈ ఘన విజయానికి నిదర్శనమని తెలుగు రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ ఆశీర్వదిస్తున్నారన్నారు. అనంతరం ఎంఎల్‌ఎ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కర్ణాటక ఘన విజయంపై బస్టాండ్ సెంటర్లో భావన సంచారాలు పేల్చడం సంతోషదాయకమని రమేష్ నాయుడుకు కితాబిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి బాలయ్య, చంద్రమౌలేశ్వర్ రెడ్డి, బకీరు హాజరత్తయ్య, ప్రశాంత్ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










