Sep 25,2023 18:37

నిందితుడు సింహాద్రి ఇల్లు ధ్వంసం చేసిన దృశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : మండలంలోని తోటపల్లి పంయాతి మజారా కామాక్షినగర్‌కు చెందిన ఈదూరు సింహాద్రి అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఎంబేటీ శివయ్య, మురళి అనే వారిపై ఈనెల 24వ తేదీన రాత్రి కత్తితో దాడి చేసి గాయ పరిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన బాధితుల బంధువులు, గ్రామస్తులు సోమవారం నిందితుడు సింహాద్రి ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో కామాక్షినగర్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసు కుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసు కొంటా యోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కత్తితో దాడికి పాల్పడ్డ నిందితుడు సింహాద్రిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ జంపాని కుమార్‌ సోమ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ మేరకు నిందితుడు సింహాద్రిని రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు ఎస్‌ఐ చెప్పారు.