Jun 10,2023 22:00

ఫొటో : వైద్య సేవలందిస్తున్న వైద్యులు

'కాకర్ల' సేవలు అభినందనీయం
ప్రజాశక్తి-ఉదయగిరి : కాకర్ల ట్రస్ట్‌ అధినేత టిడిపి నాయకులు కాకర్ల సురేష్‌ ఉచిత సేవలు అభినందనీయమని సున్నంవారిచింతల గ్రామస్తులు తెలిపారు. శనివారం మండల పరిధిలోని సున్నాం వారి చింతల గ్రామంలోని బస్టాండ్‌ సెంటర్‌ సంజీవనీ ఆరోగ్య రథం సేవలను అందించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మహిళలు మాట్లాడుతూ సంజీవనీ ఆరోగ్య రథం, అన్న క్యాంటీన్‌, మజ్జిగ చలివేంద్రాలు నియోజకవర్గం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
ట్రస్ట్‌ సభ్యులు మాట్లాడుతూ 21వ రోజు సంజీవని ఆరోగ్య రథం సున్నంవారిచింతల గ్రామంలో అనారోగ్య సమస్యలు ఉన్న 119 మంది గ్రామస్తులను డాక్టర్‌ వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈసీజీ రక్త పరీక్షలు చేసి అలాగే 65 మంది కంటి చూపు సమస్యలకు చికిత్స అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారన్నారు. 43వ రోజు అన్న క్యాంటీన్‌తో 590 మంది తమ ఆకలిని తీర్చి 61వ రోజు చలివేంద్రంతో మరో 730మంది తమ దాహమును తీర్చుకొన్నట్లు ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు.