రొద్దం : మండలంలోని రొద్దం నుంచి నారనాగేపల్లి వెళ్లేదారిలో పెన్నా నదిలో చేపట్టిన కాజ్ వే నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే శుక్రవారం భూమిపూజ చేశారు. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పెనుకొండ పావుగడ ప్రధాన రహదారి నుండి దొడగట్ట రాష్ట్ర సరిహద్దు వరకు (10 కిలోమీటర్ల) మేరకు రోడ్డు వెడల్పు చేసి పటిష్ట పరిచేందుకు, పెద్దకోడిపల్లి నుండి నారనాగేపల్లి (14 కిలోమీటర్ల) వరకు రోడ్డు నిర్మాణానికి అంచనా మొత్తం రూ. 20 కోట్ల సిఐఆర్‌ఎఫ్ నిధులతో నిర్మిస్తున్నారు. ఈ పనులలో భాగంగా నారనాగేపల్లి కాజ్వే బ్రిడ్జ్ ఏర్పాటుకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి అధికారులు, రొద్దం మండల ప్రజా ప్రతినిధులు, ఎంపిపి చంద్రశేఖర్, కన్వీనర్ తిమ్మయ్య, బి నారాయణ రెడ్డి, రాజారెడ్డి, శ్రీనివాస్, రవిశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










