కాజ్ వే పనులను వెంటనే ప్రారంభించాలి
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : ముదివర్తిపాలెం - మధువర్తి మధ్య కాజ్ వే పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుళ్లూరు గోపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందుకూరుపేట మండల కమిటీ సమావేశంలో పాల్గొన్న తుళ్లూరు గోపాల్ మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో భాగమైన ఇందుకూరుపేట మండలం నియోజకవర్గానికి దూరంగా ఉన్నదని నియోజకవర్గానికి అనుసంధానం చేయడానికి కాజ్‌వే ఒక్కటే పరిష్కారం మార్గమని తెలిపారు. ఇందుకూరుపేట మండలం మరో కోనసీమగా ప్రసిద్ధిగాంచిందని కానీ నేడు ఉప్పునీటితో వ్యవసాయ రంగానికి ప్రమాదం పొంచిఉందని తెలిపారు. ఇప్పటికే తాగునీరని ప్రజలు కొనుక్కొని తాగాల్సి వస్తుందని ఈ సమస్య పరిష్కారానికి కాజ్‌వే ఒకటే పరిష్కారం మార్గమని పేర్కొన్నారు. ముదువర్తిపాలెం - ముదివర్తి మధ్య కాజ్‌వే నిర్మాణం రాజకీయ గ్రహణం పట్టినాదని పాలకుల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కాజ్‌వే నిర్మాణం జ్యాపం జరుగుతుందన్నారు. ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పనులను వెంటనే ప్రారంభించేందుకు కృషి చేయాలని లేని పక్షంలో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టివివి ప్రసాద్, జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజా, సిపిఎం మండల నాయకులు శ్యామ్‌రెడ్డి, కోటేశ్వరరావు, సిద్ధవరపు ప్రభాకర్ రెడ్డి, కోనేటి వెంకయ్య, శేషయ్య, వెన్ను వేణు, చాన్‌బాషా, మనోహర్, వాసు, వెంకయ్య, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.










