Oct 06,2023 11:24
  • జయప్రదం చేయండి

ప్రజాశక్తి-దేవరాపల్లి : జీడీ పంటకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి ఈ నేల 10వ తేదీన శ్రీకాకుళం జిల్లా పలాసలో జరుగు జీడిరైతులు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పెర్కోన్నారు. శుక్రవారం అయిన ప్రకటన విడుదల చేసారు. జీడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు దళారీల దోపిడీకి గురై తీవ్రంగా నష్టపోతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార, వాణిజ్య పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తుంటాయని కానీ జీడి పంటకు మాత్రం ధర ప్రకటించడం లేదన్నారు. దీనిని అవకాశంగా తీసుకొని వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన ధరకు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ధర నిర్ణయంలో ఎటువంటి శాస్త్రీయత గాని, పారదర్శకత గాని లేదన్నారు ప్రస్తుతం జీడీ పిక్కలు 80 కేజీల బస్తా వ్యాపారులు 8000 రూపాయలకు కొంటున్నారని. ఒక బస్తా జీడిపిక్కల నుండి 25 కేజీల పప్పు వస్తుంది కేజీ పప్పు ధర 800 రూపాయలు అంటే ఒక బస్తా పిక్కలు వలన 20 వేల రూపాయలు వస్తుంది. ఒక బస్తా పిక్కలు ప్రోసెసింగ్ కి 2000 రూపాయలు ఖర్చు అవుతుందని రైతులు కోరిన విధంగా బస్తా జీడి పిక్కల ధర 16,000 ప్రకటించిన ఇంకా వ్యాపారులకు 2000 రూపాయలు మిగులుతుందని తెలిపారు. దీంతో పాటు జీడి తొక్క, నూక ఇతర ఉప ఉత్పత్తుల నుంచి కూడా వ్యాపారులు ఆదాయం పొందుతున్నారని అన్నారు. దీనివలన అటు రైతులు ఇటు వినియోగదారులు కూడా దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. కాబట్టి ప్రభుత్వమే జీడి పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10వ తేదీన పలాస లోని కాశీబుగ్గ టికేఆర్ కళ్యాణమండపంలో సిపిఎం రాష్ట్ర సదస్సు జరుపుతున్నదని. ఈ సదస్సులో రైతులు, కార్మికులు ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మనదేశంలో జీడి పంటకు ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉన్నదని 8 జిల్లాలలో 1.83 లక్షల హెక్టార్లలో సాగుఅవుతున్నదని సుమారు ఐదు లక్షలరైతు కుటుంబాలు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు మన రాష్ట్రంలో తయారైన జీడిపప్పు దేశ, విదేశాలలో అమ్ముడు పోయి కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. అలాంటి జీడి పంటను,పరిశ్రమను అభివృద్ధి చేసి రైతులు, కార్మికులకు ఉపాధి కల్పించవలసిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసం రైతులను బలి చేస్తున్నదన్నారు జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు 16 వేల రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించి ఆర్బికేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి పంట విస్తరణకు మరియు నిర్వహణకు గతంలో ఇచ్చిన రాయితీలు పునరుద్ధరించాలని సదస్సు జరుగుతుందని దీనికి ముఖ్య అతిదిగా సిపిఎం రాఈ.కార్యదర్శి వి.శ్రీనివాసరావు,  బి. తులసీదాసు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఎం ఎం.సూర్యనారాయణ , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏపీ రైతు సంఘం హజరు అవుతున్నారని దీనికి అధిక సంఖ్యలో జీడీ రైతులు పాల్గోని జయప్రదం చేయాలని వెంకన్న కోరారు,