మాట్లాడుతున్న ఎంపిడిఒ
జ్వరాలు ప్రబలకుండా చర్యలు
కొడవలూరు:గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించడం ద్వారా కాలానుగుణంగా వచ్చే జ్వరాలు, జలుబు, దగ్గు లాంటి వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ పి.సుబ్రమణ్యం సూచించారు. మండలంలోని యల్లాయపాలెం పిహెచ్‌సిని బుధవారం ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓపీకి వచ్చే రోగులకు మంచిగా వైద్య సేవలందించడం ద్వారా ఓపీని మరింత మెరుగు పరచుకోవాలని చెప్పారు. పీహెచ్సీ పరిధిలో ఎక్కువ గ్రామాలు, ఎస్సీ, ఎస్టీ. కాలనీలున్నందున గర్భిణుల్లో రక్త హీనత సమస్యలను గుర్తించి వైద్యం అందించాలని చెప్పారు. పీహెచ్సీలో ఇద్దరు మహిళా వైద్యులు అందుబాటులో ఉన్నందున కాన్సులు పీహెచ్సీలోనే జరిగేలా చూడాలని సూచించారు. హెచ్‌ఐఎఫ్ నిధులు సద్వినియోగం చేసుకోవడం ద్వారా హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.










