May 27,2023 21:51

ఫొటో : జవహర్‌ లాల్‌ నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

జవహర్‌ లాల్‌ నెహ్రూ వర్థంతి
పజాశక్తి-ఆత్మకూర్‌ అర్బన్‌ : ఎఐసిసి పిలుపుమేరకు ఆత్మకూరు నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ చేవూరు శ్రీధర్‌ రెడ్డి నాయకత్వంలో నెల్లూరు జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు వన్నం నాగరాజు ఆధ్వర్యంలో శనివారం ఆత్మకూరు పట్టణంలోని రాజీవ్‌ భవన్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో భారత దేశ స్వాతంత్య్ర సమరయోధుడు భారత దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి భారతరత్న పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ వర్థంతి సందర్భంగా రామానుయుని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ జవహర్‌ లాల్‌ నెహ్రూ భారతదేశానికి దశ దిశా చూపించి భావితరాల భవిష్యత్తుకి బలమైన పునాదులు వేసి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పి.మస్తానయ్య, సిహెచ్‌ అనిల్‌, ఎస్‌డి రసూల్‌, ఎ.వేణు, కె.సతీష్‌, ఏ.కుమార్‌ పాల్గొన్నారు.