ప్రజాశక్తి-విజయవాడ
జువైనల్ హౌమ్‌లో చట్టంతో విభేదించబడిన బాలల సౌకర్యార్థం మౌలిక వసతులను మరింత మెరుగు పరి చేందుకు కషి చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత అన్నారు. విద్యాధరపురంలోని కబేళా సెంటర్‌లో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ జువైనల్ వెల్ఫేర్ అండ్ కరక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది స్ట్రీట్ చిల్డ్రన్ హౌంను గురువారం మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత సందర్శించి పలు సూచనలు, సలహాలను అందించారు. ఈ సందర్భంగా అక్కడ బాలలకు అందు తున్న సౌకర్యాల కల్పనలో భాగంగా కార్యాలయ రికార్డులను పరిశీలించారు. అలాగే బాలలకు అందిస్తున్న భోజన సదుపాయాన్ని పరిశీలించి ఆహార నాణ్యతపై బాలలను అడిగి తెలుసుకుని సంతప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంది స్తున్న సౌకర్యాలకు అదనంగా రానున్న రోజుల్లో మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు.










