May 09,2023 21:08

ఫొటో : మాట్లాడుతున్న ఎంఇఒ మస్తాన్‌వలీ

జూన్‌ 5లోగా పనులు పూర్తిచేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : జూన్‌ 5వ తేదీలోగా మనబడి నాడు-నేడు ఫేస్‌-2 పనులను పూర్తి చేయాలని ఎంఇఒ షేక్‌ మస్తాన్‌ వలీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మండలంలోని మాసాపేట గంగిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలలో జరుగుతున్న మనబడి నాడు-నేడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మాణం అవుతున్న అదనపు తరగతి గదులు పహరి గోడ నిర్మాణం మినహా అన్ని రకాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాడు-నేడు కమిటీ బాధ్యత తీసుకోవాలని పలు సూచనలు చేశారు.
నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరతగతిన పూర్తిచేసి టాయిలెట్‌ గదులు నిర్మాణం పూర్తి చేసి 20వ తేదీకి పాఠశాలల్లో పెయింటింగ్‌ మౌలిక వసతులను పూర్తయ్యేలా చూడాలని ప్రధానోపాధ్యాయులు నాడు-నేడు కమిటీ సభ్యులకు వాళ్లు సూచనలు చేశారు. జూన్‌ 5లోగా పాఠశాలలో పెయింటింగ్‌ తదితర పనులు మొత్తం పూర్తిచేయాలని ఆ దిశగా ప్రధానోపాధ్యాయులు పనులను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నాడు-నేడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.