కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో చేపట్టనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ జిల్లాలో మంగళవారం ప్రచారం హోరెత్తింది. పలుచోట్ల పోస్టర్లును నాయకులు ఆవిష్కరించారు. సమ్మె ప్రాధాన్యతను వివరించారు. మండలాల్లో సమ్మె సన్నాహాక సమావేశాలు, గేట్ మీటింగ్‌లు కొనసాగాయి.
ప్రజాశక్తి - అనకాపల్లి : జివిఎంసి అనకాపల్లి జోన్ గవరపాలెం మస్తర్ల సెంటర్ వద్ద మంగళవారం జరిగిన గేట్ మీటింగ్‌లో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ మాట్లాడారు. సమ్మెలో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు.
ఆరిలోవ : సిపిఎం ఆరిలోవ జోన్ కమిటీ ఆధ్వర్యంలో టిఐసి పాయింట్ వద్ద సమ్మె, విశాఖ బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వి.నరేంద్ర కుమార్, ఐద్వా నాయకులు ఎస్.రంగమ్మ, రమణమ్మ, అప్పారావు పాల్గొన్నారు. 'విశాఖ ఉక్కు మనదే - హక్కు మనదే, పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలి' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
పరవాడ : స్థానిక ఎంఇఒ కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం సంఘం మండల అధ్యక్షురాలు కె.విమలావతి, ఐద్వా మండల కార్యదర్శి పి.మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడారు. సంఘం జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, ఎం.రమణ, నాగ అప్పారావు, సత్తిబాబు పాల్గొన్నారు.
నక్కపల్లి : స్థానిక నూకాలమ్మ ఆలయం వద్ద సిఐటియు మండల కార్యదర్శి ఎం.రాజేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమ్మె పోస్టర్‌ను అవిష్కరించారు. కార్యక్రమంలో ఐకెపి రాష్ట్ర అధ్యక్షురాలు రూపాదేవి, మండల నాయకులు దుర్గారాణి, సుబ్బలక్ష్మి, ధనలకిë, నాగేష్, నారాయణ, సూర్యనారాయణ, అప్పలరాజు, బుజ్జి పాల్గొన్నారు.
పెదబయలు : సిఐటియు కార్యాలయంలో జరిగిన సమ్మె సన్నాహక సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్.శంకరరావు మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి కె.శరభన్న, అంగన్‌వాడీ, ఆశ, విఒఎ, హాస్టల్ వర్కర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు. తొలుత వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం సంతాప సభ నిర్వహించారు.
రాంబిల్లి : నేవీ గేట్ వద్ద సమ్మె ప్రచారం చేపట్టారు. సిఐటియు మండల కార్యదర్శి జి.దేవుడు నాయుడు మాట్లాడారు. కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిహెచ్.గంగరాజు, రెడ్డి అప్పలరాజు, సిహెచ్.చిట్టిబాబు, ఎస్.అప్పలరాజు పాల్గొన్నారు.
చింతపల్లి : స్థానిక సిఐటియు కార్యాలయంలో సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ సేవకుల సంఘం నాయకులు కల్యాణ్, వంశీ, మంగ, కృష్ణ పాల్గొన్నారు.
అచ్యుతాపురం : కార్మికుల, ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు సమ్మెతో కళ్లు తెరిపించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. సెజ్ పరిశ్రమల ముఖ ద్వారం వద్ద కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆర్.రాము, మండల కార్యదర్శి కె.సోమ నాయుడు, రాజు, వాసు, సత్యనారాయణ పాల్గొన్నారు.
సమ్మెను జయప్రదం చేయాలని తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు శంకరరావు, చిరంజీవి పిలుపునిచ్చారు. అచ్యుతాపురంలోని ఉప తపాలా కార్యాలయంలో తోటి ఉద్యోగులతో వారు సమావేశమయ్యారు. కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ పోలి, బిపిఎం విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
తగరపువలస : సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ స్థానిక సిఐటియు నాయకులు రవ్వ నరసింగరావు, ఎస్.అప్పలనాయుడు మంగళ వారం వర్తక సంఘం అధ్యక్షులు డి.మురళికి వినతి పత్రం అందజేశారు.
సబ్బవరం : స్థానికంగా సమ్మె పోస్టర్‌ను ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పాడ సత్యవతి, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు వివి.రమణమ్మ, బి.రమణమ్మ, విఒఎల సంఘం నాయకులు ప్రసన్న, ఎస్.దేవి పాల్గొన్నారు.
కె.కోటపాడు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీలలో చేపట్టే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల నాయకులు ఈ.నాయుడుబాబు, రంగోలి ముత్యాల నాయుడు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో సమ్మె పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర దేవుడు, గండి జగ్గమ్మ, సత్యం, భవాని పాల్గొన్నారు.
ఆటో జాతా ప్రారంభం
ప్రజాశక్తి-కలెక్టరేట్ : సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ప్రచారం చేసే ఆటో జాతాను ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, జాతి, ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, మోటారు ట్రాన్స్ పోర్టు సవరణ చట్టం రద్దు చేయాలని, ఆర్‌టిఎ, పోలీసుల దాడులు విరమించాలని, ఆటో కార్మికులకు పిఎఫ్, ఇఎస్‌ఐతో కూడిన సమగ్ర చట్టం చేయాలని ఈ నెల 28, 29వ తేదీల్లో చేపట్టే సమ్మెను అందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోటార్ ట్రాన్స్ పోర్టు కార్మికుల సంఘం ఉపాధ్యక్షులు జి.అప్పలరాజు, ఉలవల బాబ్జి, ఎఐటియుసి నాయకులు ఎస్‌కె రెహమాన్, జి.వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు.










