Apr 21,2022 14:29

ప్రజాశక్తి-పెడన : ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులగా పదవీ బాధ్యతలు చేపట్టిన  జోగి రమేష్ ని రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన బీ.సీ. సంక్షేమ సంఘ ప్రతినిధులు గురువారం విజయవాడ రహదారులు మరియు భవనాల శాఖ అతిధి గృహంలో కలసి మంత్రికి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్  విచ్చేసిన ప్రతీ ఒక్కరి యోగక్షేమాలు ఆచరించి, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న, 50 శాతం పైగా అత్యున్నత పదవుల్లో బీ.సీ లకు అగ్రతాంబూలం వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని, మనమందరం వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. బీ.సి. సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ అతి త్వరలో ఆప్కో చైర్మన్  చిల్లపల్లి మోహనరావుతో కలసి విజయవాడలో మంత్రివర్యులకు భారీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ప్రతినిధుల హర్షధ్వానాలు మధ్య ప్రకటించారు. బీ.సి నాయకుల జై భీమ్.. జై పూలే నినాదాలతో ప్రాంగణం మార్మోగింది