జిల్లా జలవనరుల అధికారి బి.కష్ణమూర్తి
ప్ర్రజాశక్తి - రాయచోటి : జిల్లాలోని చెరువులలో నీటిని కలు షితం లేకుండా పొదుపు చేసుకుంటూ జలవ నరులను కాపాడుకుందామని జిల్లా జలవనరుల అధికారి బి. కృష్ణమూర్తి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో రైతులు నీటిని ఎలా పొదుపు చేసుకుని చెరువుల కింద పంట సాగు చేసుకోవాలో, జిల్లాలో రిజర్వాయర్లు వాటి పరిస్థితిని ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.
జిల్లా జలనరుల కార్యాలయాల వివరాలు తెలపండి?
హొ జిల్లా వ్యాప్తంగా డివిజన్ కార్యా లయాలు మదనపల్లె, కడప, కదిరి ప్రాంతాలలో ఉన్నాయి. సబ్ డివిజన్ కార్యాలయాలు రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, మదనపల్లి, తంబళ్లపల్లి, వాల్మీకిపురం, రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో ఉన్నాయి.
జిల్లాలో ఎన్ని రిజర్వాయర్ ఉన్నాయి?హొ
జిల్లా వ్యాప్తంగా మేజర్ రిజర్వాయర్లు చిన్నమండం మండలంలో శ్రీనివాసపురం రిజర్వాయర్, కె.వి.పల్లి మండలం అడవిపల్లె రిజర్వాయర్, మీడియం రిజర్వాయర్లు, రాజంపేట మండలం అన్నమయ్య ప్రాజెక్టు, గాలివీడు మండలం వెలుగుల్లు బ్యాలెన్సింగ్ రిజర్వా యర్లు న్నాయి. మైనర్ రిజర్వాయర్ల విషయాకొస్తే నిమ్మ నపల్లి మండలం బహుదా, తంబళ్లపల్లె మండలం పెద్దూరు రిజర్వాయర్లు, సంబేపల్లి మండలం ఝరికోన రిజర్వాయర్, టి.సుండుపల్లి మండలం పింఛా రిజర్వాయర్లున్నాయి.
జిల్లా వ్యాప్తంగా ఎన్ని చెరువులు ఉన్నాయి?హొ
జిల్లా వ్యాప్తంగా 3272 చెరువులు, ఆయకట్టు 1,00,073 ఎకరాల ఉంది. 100 ఎకరాల పైబడి ఆయకట్టు కలిగినవి 154 చెరువులు ఆయకట్టు 53407 ఎకరాలున్నాయి. 100 ఎకరాల లోపు ఆయకట్టు చెరువులు 3118, ఆయకట్టు 46666 ఎకరాలు ఉన్నాయి.
గత ఏడాది తెగిన అన్నమయ్య ప్రాజెక్టుకు మరమ్మతులు చేపడుతున్నారా?హొ
2021 సంవత్సరం నవంబర్‌లో అతి భారీ వర్షాలకు జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు, పించా ప్రాజెక్టులు తెగిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు పునర్మాణానికి 787.77 కోట్లు, పింఛా ప్రాజెక్ట్ పునర్నిర్మాణానికి 84.33 కోట్ల బడ్జెట్ మం జూరైెంది. ఈ నెలాఖరులోపు టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి మొదటి వారంలో పనులు మొదలుపెడతాం
తుపాను వల్ల చెరువులకు ఎలాంటి నష్టం వాటిల్లింది?
హొ ఈ సంవత్సరం వర్షాలు వల్ల ఎలాంటి చెరువులకు నష్టం వాటిల్లలేదు. 2020 - 21 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 267 చెరువులు దెబ్బతిన్నాయి. అందులో 160 చెరువులకు మరమ్మతులు పూర్తి చేశాం. మిగిలిన చెరువులు పనులు జరుగుతున్నాయి.
జిల్లాలో మంజూరైన నిధులు, చేపట్టిన అభివృద్ధి గురించి వివరించండి?
ప్రపంచ బ్యాంక్ నిధులతో ఎపిఐ ఐఎటిపి ప్రాజెక్టు కింద చెరువులు బలోపేతానికి 13 పనులకుగానూ రూ.147 కోట్లు మంజూర య్యాయి. హొఅందులో 5 పనులు పూర్తి చేశాం. 8 పనులు పురోగతిలలో ఉన్నాయి. జపాన్ నిధులతో ఎపిఐఎల్ టి పథకం కింద 19 పనులుకు రూ.15. 82 కోట్లు మంజూరయ్యాయి. ఐదు పనులు పూర్త య్యాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నా యి. కురబలకోట మండలం ముదివీడు బ్యాలెన్స్ రిజర్వాయర్‌కు రూ. 759. 50 కోట్లు విడుదల కాగా 25 శాతం పనులు పూర్తయ్యాయి. గాలివీడు లిఫ్టు వెలిగల్లు జలాశయం నుంచి రాయచోటి, గాలివీడు చెరువులకు నీటిని నింపడానికి రూ.94.56 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మంజూరయ్యాయి. ఝరికోన రూ.42.25, రామా పురం లిఫ్ట్ స్కీమ్ రూ.227.10 కోట్లు, కలిబండ బెస్తపల్లి లిఫ్ట్‌కు రూ.29.38 కోట్లు నిధులు మంజూరయ్యాయి. జిఎన్‌ఎస్‌ఎస్‌హెచ్ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు అనుసంధానం లిఫ్ట్ స్కీమ్‌కు రూ.5.36 కోట్లు మంజూరైనాయి. గాలివీడు, తంబ ళ్లపల్లె, కురబలకోట పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే వెలగల్లు రిజర్వాయర్లకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది.










